|
దావీదు దైవజనుడు మరియు విజయవంతమైన రాజు కాకముందు 13 సం||లు అనేక శ్రమలు మరియు శోధనలు ఎదుర్కొనెను.
కొన్ని సం||ల తరువాత ఆయన ఈలాగు వ్రాసెను: “దేవా! నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్ములను నిర్మలులను చేసియున్నావు. నీవు బంధీగృహములో మమ్ము ఉంచితివి. మా నడుములమీద గొప్ప భారము పెట్టితివి. నరులు మానెత్తిమీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. అయినను నీవు (ఆత్మీయ) సమృద్ధిగల చోటికి మమ్మును రప్పించియున్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను” (కీర్తనలు 66:10-13).
మరొకవైపున, సౌలు ధనవంతుల ఇంట పెరిగి సుఖవంతమైన జీవితమునుండి నేరుగా రాజు అయ్యెను. అతడు ఎన్నడైననూ శ్రమలు మరియు శోధనలను ఎదుర్కొనలేదు. కనుక అతడు దేవుని ఎరిగి యుండలేదు మరియు రాజుగా అతడు ఓడిపోయెను.
దావీదు తరువాత రాజైన సొలోమోనుకూడా ఎన్నడైననూ శ్రమలు మరియు శోధనలు ఎదుర్కొనలేదు. రాజకుమారుడుగా అతడు రాజభవనములో సుఖవంతమైన జీవితమును జీవించెను. అతడు కూడా రాజుగా ఓడిపోయెను.
మనము శ్రమలు మరియు శోధనలగూండా వెళ్ళుటద్వారానే దేవుని ఎరిగియుండి మరియు ప్రభావితమైన, ఫలభరితమైన పరిచర్య చేయగలమని ఈ ఉదాహరణలు మనకు బోధించుచున్నవి. ఈ విధముగానే పౌలు కూడా విజయవంతమైన అపోస్తలుడాయెను (2 కొరింథీ 1:4-11; 11:22-33). అందువలననే సువార్తను బోధించి ధనవంతులై మరియు సుఖవంతమైన జీవితమును జీవించు ఈనాటి అనేక బోధకులు ఆత్మీయలుగా లేరు మరియు వారి మందకు వారు మాదిరిగా లేరు.
ఆయన సేవకుడుగా ఉండుటకు దేవుడు నిన్ను పిలిచి యుండవచ్చును. నీవు కేవలము పిలువబడియున్నావు కాబట్టి నీవు సేవకు సిద్ధముగా ఉన్నావని ఊహించుకొనవద్దు. నీవు అనేక సం||లు శోధనలలో నమ్మకముగా ఉండనియెడల, దేవుని ప్రజలకు ఆత్మీయనాయకుడుగా ఉండలేవు. సౌలు మరియు సొలోమోను వలె చివరకు నిన్ను నీవు నాశనము చేసుకొందువు. గనుక మొదటిగా దేవుడు నిన్ను శ్రమలు మరియు శోధనలగుండా తీసుకొని వెళ్ళును. ఇతరులు నిన్ను అపార్ధము చేసుకొనునట్లును మరియు వారు నీమీద అసూయపడునట్లును ఆయన అనుమతించును. ఇతరులు నిన్ను బాధించునట్లును మరియు అణచివేయునట్లును ఆయన అనుమతించును. ఆ పరిస్థితులన్నిటిలో దేవునియందు నమ్మికయుంచి, దావీదువలె నిన్ను నీవు తగ్గించుకొనినయెడల, దేవుడు నిన్ను ఒకరోజున సమృద్ధిలోనికి మరియు ఆశీర్వాదములోనికి నడిపించును.
చెవులుగలవాడు వినునుగాక.
|