|
యిర్మియా 23:5,6 లో యిర్మియా ప్రభువైన యేసుని గురించి ప్రవచించుచు ఆయనను “నీతిచిగురు” మరియు “మనకు నీతియై యున్నాడు” అనియు పిలుచుచున్నాడు.
ఆయన నీతిని మనకు ధరింపజేసి, మనలను నీతిమంతులుగా చేయు ప్రభువునకు ఈ నామము ఇవ్వబడినది. ఇది క్రొత్త నిబంధన నామము - యిర్మియా క్రొత్త నిబంధన గురించి ప్రవచించియున్నాడు.
ఇక్కడ బోధకులు జాగ్రత్త పడవలసిన అనేక హెచ్చరికలు ఇవ్వబడినవి గనుక ఈ అద్భుతమైన అధ్యాయమును వారు చదువుట మంచిది. ఈఅధ్యాయములో అబద్ధ ప్రవక్తలు బయలు పరచబడి మరియు వారినిగూర్చి వివరించబడినది. దేవుని మాట వినుటకు వారికి సమయములేదు గనుక వారు అబద్ధప్రవక్తలు (యిర్మియా 23:18). దేవుని యెదుట నిలచి మరియు ఆయన మాట కొరకు కనిపెట్టుటకు వారు చాలా సోమరులై యున్నారు.
తమకొరకు ఘనతను మరియు డబ్బును కోరుకొనే అనేక అబద్ధప్రవక్తలు ఈనాడు క్రైస్తవ్యములో ఉన్నారు. వారు కలలను (దర్శనములు) పొందినట్లుగా ఊహించుకొని తప్పుగా ప్రవచించుచున్నారు.
వారి మాటలు వినవద్దని యిర్మియా హెచ్చరించుచున్నాడు. వారు తమ సొంత ప్రసంగములను సిద్ధపరచుకొని “ప్రభువు ఈలాగు చెపుచున్నాడని” చెప్పుదురు. కాని ప్రభువు వారితో మాట్లాడలేదు. ఈనాడు ఆ మాటను అజాగ్రత్తగా వాడే వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. ప్రభువు నిజముగా నీతో మాట్లాడి యున్నాడో లేదో తెలిసికొనకుండా “ప్రభువు ఈలాగు చెప్పుచున్నాడని” చెప్పుట చాలా అపాయకరమైనది. దేవుని భయము కొంచముకూడ లేనివారే, వారికి వచ్చిన తలంపులను చెప్పి మరియు ఈ మాటను ఉపయోగించుచున్నారు. ఇది అపాయకరమైనది మరియు బహుచెడ్డది.
అటువంటివారు ఈ అధ్యాయమును చదివి మరియు దేవునియెడల భయభక్తులు నేర్చుకొనినయెడల --- అప్పుడు దేవుడు మాట్లాడునని నేను ప్రోత్సహించుచున్నాను. “దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నానని” ( 1 కొరింథీ 7:40) చెప్పిన పౌలు వంటి దీనుల ద్వారా దేవుడు మాట్లాడును. కాని “ప్రభువు ఈలాగు చెప్పుచున్నాడు” అని గర్వముతో చెప్పెడి వారిద్వారా కాదు. ఈనాటి క్రైస్తవులలో అటువంటి అబద్ధప్రవక్తలు వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి అటువంటి వారి విషయము జాగ్రత్తపడుము.
ఆయన వాక్యము అగ్నివంటిది మరియు సుత్తి వంటిదని దేవుడు చెప్పుచున్నారు (యిర్మియా 23:29). అనేక బోధకుల మాటలు ఎందువలన ప్రజల హృదయములను విరుగగొట్టి మరియు మండేటట్లు చేయుటలేదు. ఎందుకనగా వారి మాటలు ప్రభువు యొద్దనుండి వచ్చినవి కావు.
|