English shape=
      

వారపు సందేశం - Word For The Week

"వారపు సందేశం" అనునది ప్రతివారము ప్రచురింపబడే వార్తా సందేశము. ఇందులో ప్రతి అంశము జాక్ పూనన్ గారి యొక్క ఉపదేశములు, పుస్తకాలు లేదా ప్రసంగముల నుండి స్వీకరించబడును.
2011 |  2012 |  2013
నీ పూర్వీకుల గురించి గర్వించవద్దు
మే 2012 (3) - జాక్ పూనన్

యేసుప్రభువు పరలోకమునుండి భూలోకమునకు వచ్చుటయే ఆయన దీనత్వము యొక్క గొప్ప ప్రత్యక్షతయైయున్నది. కాని “ఆయన మానవుడుగా కూడా తన్నుతాను తగ్గించుకొనెనని” (ఫిలిప్పీ 2:8) లో చెప్పబడియున్నది. “అన్ని విషయములలో ఆయన తన సహోదరులవంటి వాడుగా మారి”(హెబ్రీ 2:17) , దేవుని ఎదుట మనుష్యులందరి వంటి వాడాయెను. దేవుడే సర్వమగునట్లు ఆయన రిక్తునిగా చేసికొని ఏమీకానివాడయ్యెను. ఇదియే నిజమైన దీనత్వము.

లోకసంబంధమైన మహిమ మరియు గొప్పతనము మనిషి యొక్క స్థానమునుబట్టి, ఆస్తులనుబట్టి, సాధించినవాటినిబట్టి, కుటుంబ పూర్వీకులనుబట్టి మొదలగు వాటినిబట్టి ఉండును. కాని యేసుక్రీస్తులో చూచిన విధముగా దేవుని మహిమ దీనికి ఎంత వేరుగా ఉన్నది.

తాను పుట్టబోయె కుటుంబమును పుట్టకముందే ఎన్నుకునే అవకాశము ఒక యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. మనలో ఒకరికి కూడ అటువంటి అవకాశము లేదు.

యేసుప్రభువు ఎటువంటి కుటుంబమును ఎన్నుకున్నారు? అక్కడ నుండి మంచిది ఏదైనరాగలదా? అని పిలువబడిన నజరేతు అను పట్టణములోని గుర్తింపు లేని ఒక వడ్రంగి కుటుంబమును ఆయన ఎన్నుకున్నారు (యోహాను 1:46). మరియ, యోసేపులు ఎంత బీదవారనగా ఒక గొఱ్ఱెపిల్లను కూడ దేవునికి బలిగా అర్పించలేకపోయిరి (లూకా 2:22-24, లేవి 12:8).

మరియు తాను ఖచ్చితముగా ఎక్కడపుట్టవలెనో కూడ ఎన్నుకొనుటకు ఆయన ఒక్కడికే అవకాశము ఉన్నది. అటువంటి అవకాశము ఉండి కూడా ఎక్కడ పుట్టుటకు నిర్ణయించుకున్నారు? ఆయన పశువుల తొట్టిలొ పరుండ బెట్టబడెను.

ఇంకను ఆయన ఎటువంటి వంశావళిని ఎన్నుకున్నారో చూడగలము. ఆయన వంశావళిలో నలుగురు స్త్రీలు ఉన్నారు (మత్తయి 1:3-6). తన మామయైన యూదాతో వ్యభిచారము చేసిన తామారు మొదటి స్త్రీ, యెరికోలో వ్యభిచారినిగా ఉన్న రాహాబు రెండవది, లోతు తన కుమార్తెతొ చేసిన వ్యభిచారము వలన పుట్టిన మోయాబు వంశస్థురాలైన రూతు మూడవ స్త్రీ, దావీదుతో వ్యభిచారము చేసిన బత్షెబ నాలుగవ స్త్రీ.

యేసుప్రభువు అటువంటి వంశావళిని ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకనగా పతనమైన ఆదాము సంతానములో ఒకడుగా ఉండుటలో ఆయన దీనత్వమును చూచుచున్నాము. వంశావళి గురించి గాని పుట్టిన స్థలము గురించి గాని ఆయన గర్వించదలచుకొనలేదు.

యేసుప్రభువు సంపూర్ణముగా మనవంటి వాడాయెను. వంశమును బట్టి గాని కుటుంబమును బట్టి గాని పదవిని బట్టి గాని మొదలగువాటిని బట్టి గాని గాక మనుష్యులందరు ఒకటే అని ఆయన నమ్మెను. గనుక సమాజములో అత్యల్పమైనవాడుగాను మరియు దాసుడుగాను అయ్యెను. అందరికి దాసుడగునట్లు, అందరికంటే తక్కువ వాడుగా వచ్చెను. వేరేవాళ్ళ క్రిందకు వెళ్ళిన వాడు మాత్రమే, వారిని పైకిలేవనెత్తగలడు. ఆయన ఆవిధముగా వచ్చెను.

అనువాదము : టి.ఎల్.మర్రెడ్డి     ఈ పేజిని ముద్రించుకోండి    ఈ పేజీని పంపండి

"వారపు సందేశం" - మీకు ఏవైనా అభిప్రాయములు లేదా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మాకు పంపగలరు :telugu@cfcindia.com, cfc@cfcindia.com
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి | వారపు సందేశం | దైవ సందేశములు | ఆడియో| వీడియో | సంప్రదించండి

© Copyright - Christian Fellowship Church , Bangalore. (INDIA)